ఉయ్యాలవాడ కాదు.. మహావీర?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 151వ సినిమాకు సన్నాహాలు జోరందుకున్నాయి. సినిమా వచ్చే నెలలో మొదలుకానున్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందనుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడంతోపాటు అటు భారీ బడ్జెట్‌ను పెంచేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా టైటిల్ మారనుంది. ఇంతకీ ఈ సినిమాకు ఏ టైటిల్ పెడుతున్నారో తెలుసా మహావీర అని. బాహుబలి స్ఫూర్తితో భారీగా తెరకెక్కే ఈ సినిమా పేరు అన్ని భాషాలకు ఒకేలా ఉండేలా ఈ టైటిల్‌ను పెడతారట అన్నట్టు ఈ సినిమాలో గ్లామర్ భామ నయనతార హీరోయిన్గా నటిస్తుందట.













