విశ్వనాథ్ కు మెగాస్టార్ శుభాకాంక్షలు
ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాథ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం పట్ల సినీ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో కళాత్మకమైన చిత్రాలను అందించిన దర్శకుడు విశ్వనాథ్. ఫాల్కే పురస్కారానికి పూర్తి అర్హుడని కొనియాడారు. ఫిల్మ్‌నగర్‌లోని విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన అభిమాన దర్శకుల్లో ఒకరైన విశ్వనాథ్ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని గెలుచుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని కోరుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో తాను నటించిన చిత్రాలకు సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టు తెలిపారు.













