మెగాస్టార్ 151వ సినిమాలో రానా!
మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం చేయనున్న ఈ సినిమాని నిర్మాత రామ్‌చరణ్‌తేజ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలని భావిస్తున్నారు. అందుకే సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించడమే కాకుండా నటీనటులు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్. అందులో భాగంగానే బాహుబలి సిరీస్‌తో దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నటుడు, చిన్నానాటి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటిని ఈ ప్రాజెక్టులో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ రానా బాహుబలి-2 ప్రమోషన్లో బిజీగా ఉండటం వలన ఈ ప్రపోజల్ ఇంకా ఆయన వరకు వెళ్లలేదని కూడా అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనుంది.













