తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి కళాతపస్వి
తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ కళాతపస్వి విశ్వనాథ్ అని, ఆయన సాధించిన విజయాలు అనితరసాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కె.విశ్వనాథ్ సత్కార కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం సౌండ్ ఇంజినీర్గానే ఆయన తృప్తిపడి ఉంటే, యూవత్ భారతదేశ సినీ ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకునే వారు కాదన్నారు. అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.








