అనంతలో సినీ తారల క్రికెట్
సినీ తారల క్రికెట్ టోర్నమెంట్ను అనంతపురంలో నవంబర్ 5న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్, టాలీవుడ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు అనంతపురంలోని క్రిసెంట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కప్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, సినీ హీరోయిన్లు పునమ్ రౌత్, రిచా, భాను శ్రీ మెహ్రా, కామ్నాజెఠ్మలానీ, పుట్టపర్తి, అనంతపురం శాసనసభ్యులు పల్లె రఘునాథరెడ్డి, వైకుంఠ ప్రభాకర్ చౌదరి, జిల్లా పరిషత్ చైర్మణ్ పూల నాగరాజు, అనంతపురం నగర మేయర్ మదమంచి స్వరూప పాల్గొన్నారు.








