కళాభవన్ మణి మృతిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం
జెమిని సినిమా లో విలన్
ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి మృతిపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఆయనది అసహజ మరణమని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మణి కుటుంబసభ్యులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం దర్యాప్తు చేపట్టాలంటూ సీబీఐని హైకోర్టు ఆదేశించింది. దీంతో కళాభవన్ మణి మృతి కేసుపై ఉన్న అన్ని పత్రాలను సీబీఐ సేకరించి విచారణ ప్రారంభించింది








