ఆమే అందమే ఇప్పుడు మైనస్ అయ్యింది..
అందంగా వుండాలని చాలామంది తహతహలాడుతారు. ఇందుకోసం చేయని ప్రయత్నాలంటూ వుండవు. కానీ, 24 ఏళ్ల కాంబోడియన్ హీరోయిన్ డెన్నీక్వాన్కి ఒళ్లంతా వయ్యారమే. గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజులకే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సెక్సీతారగా మారిపోయింది. అందాలతోనే అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ బ్యూటీకి, ఆ అందమే ఇప్పుడు మైనస్ అయ్యింది. అందాల ఆరబోత మరింత ఎక్కువయిందని ఆ దేశ కల్చరర్ శాఖ కన్నెర్ర చేసింది. ఫలితం క్యాన్పై ఏడాదిపాటు నిషేధం పడిపోయింది. సినిమాలో ఎలా కనిపించాలి, డ్రెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్న విషయాల్లో అమెకు శిక్షణ ఇప్పించాలని ఆదేశించింది.








