మెగాస్టార్ కు బర్త్డే విషెస్
సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్నారు చిరంజీవి. ఎందరో అభిమానుల మనసులు దోచుకున్న మెగాస్టార్, ఈ రోజు తన 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కొంత విరామానంతరం చిత్రసీమకు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవికి ఇది ఫస్ట్ బర్త్ డే. కాగా, ఈ బర్త్ డేని గ్రాండ్గా జరుపుకుంటున్నారు మెగా ఫాన్స్. ఇక మెగాస్టార్ గా అలరిస్తున్న చిరంజీవి బర్త్ డే వేడుకలను చిరు అభిమానులు ప్రతి ఏటా ఎంతో సందడిగా జరుపుతున్నారు. అన్నదానం, రక్తదానం ఇలా సేవా కార్యక్రమాలతో తమ అభిమాన హీరో బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలే సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.













