వాళ్ల బెదిరింపులకు భయపడను : కమల్‌హాసన్
తనను అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న వారి బెదిరింపులకు భయపడనని విశ్వనటుడు కమల్‌హాసన్ సృష్టం చేశారు. ఆయన హోస్ట్‌గా వస్తున్న బిగ్‌బాస్ వివాదంలో చిక్కుకుంది. ఈ షో పేరిట తమిళ సంస్కృతిని కించపరుస్తున్నారంటూ హిందు మక్కల్ కట్చి (హెచ్ఎంకె) సంఘం సెక్రటరీ చెన్నయ్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కమల్ స్పందించారు. ఇటువంటి వాటిని తాను పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఈ దేశ చట్టమే తనను కాపాడుతుందని పేర్కొన్నారు. గత 37 ఏళ్లుగా తాను సంక్షేమ సంఘాల ద్వారా సేవ చేస్తూనే ఉన్నట్టు ఆయన తెలిపారు.













