ఉయ్యాలవాడ లో అమితాబ్?
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం తెరక్కెనున్నది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతకాంపై రామ్‌చరణ్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలోకి కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ నటించనున్నట్లు తెలిసింది. ఇటీవలే ఆయన్ని చిత్రబృందం కలిసి కథ వినిపించినట్లు సమాచారం. కథ, పాత్ర చిత్రణ నచ్చడంతో ఆయన ఈ సినిమాలో నటించడానికి సముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది.








