బాలయ్య 101వ మూవీకీ టైటిల్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101 సినిమాకు టైటిల్ ఓకే అయింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఏం టైటిల్ ఎట్టరో తెలుసా? టపోరి. కథ ప్రకారంగా ఈ టైటిల్ బాగుంటుందని పూరి సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ పదం చిరంజీవి నటించి గ్యాంగ్ లీడర్ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి సాంగ్లోంచి తీసుకున్నాడట. అప్పట్లో సూపర్‌హిట్ సాంగ్‌గా నిలబడ్డ పాట అది. అందుకే నందమూరి ఫాన్స్‌లో ఈ విషయం సంచలనం రేపుతోంది. ఇక నెగెటివ్ టైటిల్స్ పెట్టి సినిమాకు పాజిటివ్ క్రేజ్ తెచ్చుకోవడంలో పూర్తి తరువాతే ఎవరైనా. ఈ సినిమా విషయంలో కూడా టైటిల్ భిన్నంగా ఉండాలని ప్లాన్ చేసిన పూరి ఐడియా బాలయ్యకు నచ్చిందో లేదో మరి. బాలయ్య ఓకే అంటే టపోరి టైటిల్ కన్ఫర్మ్ అయినట్టే. సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ను అప్పుడే పూర్తి చేశారు. పూరి జగన్నాథ్ టేకింగ్ అంటే స్పీడ్ అని తెలిసిందే కదా.







