ప్రారంభమయిన బాలయ్య 102 వ చిత్రం
నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. కే.ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్‌నిచ్చారు. ఇందులో బాలకృష్ణకి జోడీగా నయనతార నటిస్తున్నారు. ప్రొడక్షన్ నెం.5 బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే పంజాబీలో టాప్ హీరో ఈసినిమాలో పవర్‌పుల్ విలన్‌గా చేయబోతున్నారు. ఇందులో బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, ప్రభాకర్, శివపార్వతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిగత నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.













