‘బాబు బాగా బిజీ’ ట్రైలర్ విడుదల
అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘బాబు బాగా బిజీ’ ట్రైలర్ వచ్చేసింది. హిందీలో విడుదలైన ‘హంటర్’ సినిమాకు ఇది రీమేక్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కెంచబోతున్నామని దర్శకుడు నవీన్ మేడారం చెప్పినప్పటికీ.. ట్రైలర్ చూస్తే కామెడీ కన్నా రొమాన్సే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, యాంకర్ శ్రీముఖి విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 13న బాబు బాగా బిజీ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.













