బాహుబలి 2 మరో ఆసక్తికర విషయం!
యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బాహుబలి ది కన్క్లూజన్. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ కన్నా రెండో భాగం నిడివి కొద్దిగా ఎక్కువట. తొలి భాగంతో పోలిస్తే 10-11 నిమిషాలు ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని పరిగణలోకి తీసుకుంటే నిడికి కాస్త ఎక్కవైనా పర్వాలేదని చిత్ర బృందం భావిస్తోందట. ముఖ్యంగా పోరాట సన్నివేశాల కారణంగానే ఈ నిడివి పెరిగిందని తెలుస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించారు.













