బాహుబలి 2కు అరుదైన గౌరవం
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్ర ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అరుదైన గౌరవాలు దక్కించుకున్న ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు రొమానియా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శన జరుపుకుంది. ఇక ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోను బాహుబలి 2 చిత్రం స్క్రీనింగ్ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాతలు మాస్కోకి వెళ్ళనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి 2 చిత్రం ఇప్పటి వరకు 1650 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా, త్వరలో 2000 మార్కు అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. రేపటితో బాహుబలి 2 చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోనుంది. చైనాతో పాటు మరి కొన్ని దేశాలలో ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.













