మహేష్ మూవీ కోసం భారీ అసెంబ్లీ సెట్..
మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ సినిమా పూర్తికావచ్చింది. ఇప్పటికే పది రోజులుగా చెన్నైలో క్లైమాక్స్ సన్నివేశాల్లో పాల్గొన్న మహేష్ ఆ షూటింగ్‌ను పూర్తిచేసి ప్రస్తుతం విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చాక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. 19 నుండి ఈ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన కొరటాల, మహేష్ లేని సన్నివేశాలను జోరుగా తెరకెక్కిస్తున్నాడు. మహేష్ సరసన ఖైరా అద్వానీ నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెట్‌ను వేశారు. ఈ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.








