రాఖీ సావంత్‌కు అరెస్టు వారెంటు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కి లూథియానా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రామాయణాన్ని రచించిన వాల్మీకిపై అభ్యంతర వ్యాఖ్యల విషయంలో పోలీసులు రాఖీ సావంత్‌కి అరెస్టు వారెంట్ జారీ చేశారు. గతేడాది ఓ ప్రైవేటూ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో రాఖీ సావంత్ వాల్మీకీని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆమెపై కేసు నమోదైంది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు మార్చి 9న కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉండగా, రాఖీ సావంత్ హాజరు కాలేదు. దీంతో కోర్టు మరోసారి రాఖీసావంత్‌కి సమన్లు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.













