యోగా నా జీవితాన్నే మార్చేసింది
తన జీవితాన్ని మార్చేయడంలో యోగా పాత్రే కీలకం అని అంటోంది అనుష్క. ఆమె సినిమాల్లోకి రాక ముందు యోగా టీచర్‌గా పనిచేసేవారన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అనుష్క యోగాను మర్చిపోలేదు. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనుష్క తన జీవితంలో యోగా తెచ్చిన మార్పును గుర్తు చేసుకుంది. యోగా టీచర్‌గా మారాలన్నది నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాల్లో మర్చిపోలేనిది. మా ఫ్యామిలీలో అందరూ డాక్టరు, ఇంజినీర్లే. అలాంటి నేను యోగా ఎంచుకోవడం సాహసోపేతర నిర్ణయమనే చెప్పాలి. కానీ నా జీవితంలో చోటుచేసుకున్న పెను మార్పులకు యోగానే కారణం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అంటూ ధ్యానం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది దేవసేన. బాహుబలి సినిమా తర్వాత అనుష్క భాగమతి చిత్రంలో నటిస్తోంది.













