అనుష్కకు చేదు అనుభవం!
సినిమా షూటింగ్ కోసం తమిళనాడులోని కోవై జిల్లా పొల్లాచ్చికి వెళ్లిన నటి అనుష్కకు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ స్పాట్లో ఆమె కోసం ఏర్పాటు చేసిన కారవాన్‌ను స్థానిక రవాణ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా కారవాన్‌ను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేకుండా ఈ వాహనాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో కారవాన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాహుబలి-2 తరువాత అనుష్క తెలుగులో భాగమతి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది.








