ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే వదులుకోను
వెండితెర మీద ప్రభాస్, అనుష్క జోడీగా ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ జంటకు హిట్ పెయిర్‌గా కూడా పేరుంది. ఇక, బాహుబలి-2తో ఈ జంటకు జాతీయ స్థాయిలో కూడా మంచి పేరొచ్చింది. తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్క, ప్రభాస్ అంటే తనకిష్టమని, అతణ్ని వదిలేది లేదని, భవిష్యత్తులో కూడా అతనితో కలిసి సినిమాలు చేస్తానని చెప్పింది. ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే ఎప్పుడు వదులుకోనని చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్‌కే చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భాగమతి సినిమాలో నటిస్తోంది అనుష్క. మరి భవిష్యత్తులో మరోసారి అనుష్క, ప్రభాస్ వెండితెరపై జంటగా కనిపించే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.













