అనసూయా! ఆ వార్త నిజమేనా?
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ఓ హాట్న్యూస్ రెండ్రోజులుగా సర్కులేట్ అవుతుంది. ఇటీవలి కాలంలో అనసూయ బాగా లావైపోతోందన, నడుము సైజు విపరీతంగా పెరిగిపోయిందని, సన్నబడేందుకు ఆమె ప్లాసిక్ట్ సర్జరీ చేయించుకుంటోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తపై అనసూయ కాస్త ఘాటుగానే స్పందించింది.చాలా రోజులుగా నా గురించి ఎటువంటి వార్తలూ రాకపోయేసరికి ఇలాంటి కొత్త వార్త పుట్టించారు. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నానడం పూర్తిగా అబద్ధం. నన్ను సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తేసున్నారు. అయినా ప్లాస్టిక్ సర్జరీలాంటి షార్ట్కట్స్ను నేను నమ్మన్ణని ఓ ఫాలోయర్ అడిగిన్న ప్రశ్నకు సమాధానంగా అనసూయ తన ట్విట్టర్ ఖాతాలో రాసింది.













