ప్రియాంక హాట్ డ్రెస్ పై బిగ్ బి ఆసక్తికర స్పందన!
జర్మన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అక్కడ ప్రియాంక చోప్రా కలిసినప్పటి డ్రస్ పై రేగిన వివాదంపై బాలీవుడ్లో ఇంకా కొనసాగుతోంది. మోడీ ముందు కూర్చున్న ప్రియాంక పద్ధతిగా డ్రస్ చేసుకోలేదని, తొడలను ప్రదర్శించిందని కొంతమంది ధ్వజమెత్తారు. ప్రియాంకపై విరుచుకుపడ్డారు. అసలు మోడీ అంటే ఏమనుకుంటున్నావు? అంటూ వారు ధ్వజమెత్తారు. వారి దాడిని ఏ మాత్రం లెక్క చేయలేదు ప్రియాంక. మరింత కేర్ లేస్ గా తను మాత్రమే గాక, తన తల్లి కూడా షార్ట్ డ్రస్ వేసుకొని దిగిన ఫొటోను ఆమె పోస్టు చేసింది. తొడలు కూడా అన్ని శరీరభాగాల్లాంటివే అని, ప్రియాంక తేల్చేసింది. మరి ఈ వ్యవహారంపై ఇతర సెలబ్రిటీల స్పందనను తెలుసుకునే పనిలో పడింది మీడియా. ఇందులో భాగంగా సన్నీ లియోన్ స్పందన్ననను కోరగా, అమె ప్రియాంక డ్రస్ ప్రియాంక ఇష్టం అని తేల్చేసింది. సన్నీ స్పందన అలా ఉంటే, ఈ వివాదం పట్ల అంటీ ముట్టనట్టుగా ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ప్రియాంక డ్రస్సింగ్ గురించి స్పందించమని కోరగా, నేను ప్రింయాక చోప్రానూ కాదు, ప్రధానమంత్రి మోడీని కాదు. మరి దానిపై ఎందుకు స్పందించాలి? అని బిగ్ బి ఎదురు ప్రశ్న వేశారు. ఆ వివాదం గురించి స్పందించి లేని తలనొప్పులు తెచ్చుకునే ఉద్దేశం తనకు లేదని అమితాబ్ ఆ విధంగా సృష్టతనిచ్చారు.













