అల్లు అర్జున్ ట్రైనింగ్ అమెరికాలో కాదు ఇక్కడే!..
అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం ఫిజికల్‌గా మేకోవర్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో మిలటరీ అధికారిగా కనిపించనున్నాడు. దానికోసం ప్రత్యేకంగా మిలటరీలో శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆయన అమెరికాలో ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ట్రైనింగ్ ఇక్కడే జరుగుతుందని, అమెరికా నుండి వచ్చిన ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందట. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 12 నుండి అల్లు అర్జున్ షూటింగ్లో పాల్గొటారని సమాచారం. దేశభక్తి నేపథ్యంలో తెరకెకుకతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో అను ఇమాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రీకరణ వేగంగా జరిపి వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు యూనిట్ సభ్యులు.








