అమెరికా వెళ్తున్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతి చిత్రంలోనూ ఓ కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తుంటారు. పాత్ర పాత్రకూ గెటప్ మారుస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంటారు. ఇటీవల విడుదలైన డీజే (దువ్వాడ జగన్నాథమ్) లోనూ ఆయన కొత్త తరహాలో కనిపించారు. బ్రాహ్మణ యువకుడిగా ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా కనిపించారు. ఇందులోని తన పాత్ర కోసం బన్ని కొన్ని రోజులపాటు బ్రాహ్మణుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. బ్రాహ్మణ యువకుడి హావభావాలను అడిగి తెలుసుకున్నారు. డీజే తర్వాత బన్ని నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రంలో ఆయన మిలటరీ అధికారిగా కనిపించబోతున్నారు. కాగా తన పాత్రకు తగ్గట్టు దేహదారుఢ్యాన్ని మార్చుకోవడానికి ఆయన అమెరికా వెళ్తున్నారట. దాదాపు నెల రోజులు ఆయన అక్కడ శిక్షణ తీసుకోనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. వక్కంతం వంశీ నా పేరు సూర్యక దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స సంస్థ నిర్మిస్తోంది. అను ఇమ్మాన్యుయెల్ కథానాయిక. విశాల్-శేఖర్ స్వరాలు అందిస్తున్నారు.













