అలాంటి చాన్స్ వస్తే అసలు వదులుకోను
దక్షిణాది నటుల్లో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని అంటోంది బాలీవుడ్ నటి ఆలియా భట్. ట్వీటర్లో ఫ్యాన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేసిన ఆలియా వారు అడిగిన ప్రశ్నలకు జావాబు చెప్పింది. ప్రభాస్‌తో సినిమా చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు, బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌తో పనిచేసే అవకాశం వస్తే వదులుకోనని చెప్పింది. ప్రభాస్ అంతర్జాతీయ స్థాయి నటుడని ఆయనతో నటించడం అంటే అదృష్టం కలిసి రావాలని అంది. బాహుబలి 2 సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ భారీ విజయానికి మరో పేరు కావాలా? ఇదో రాక్ బస్టర్ చిత్రం. నాకు చాలా నచ్చింది అని సమాధానమిచ్చింది ఆలియా. ఆలియా ప్రస్తుతం డ్రాగన్, గల్లీ బాయ్ సినిమాల్లో నటిస్తోంది.













