అఖిల్ కొత్త సినిమా ‘హలో’ ఫస్ట్ లుక్ విడుదల
అఖిల్ అక్కినేని కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఎట్టకేలకు టైటిల్ తో కలిపి వచ్చేసింది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పేరును ”హలో” అని ఖరారు చేశారు. ఈ విషయాన్ని నాగార్జున సోమవారం ట్విట్టర్లో వీడియో ద్వారా తెలియజేశారు. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ లో అఖిల్ ఒక పెద్ద బిల్లింగ్ అంచులో మనోడు రివర్స్ జంప్ కు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాడు. కాకపోతే అంచనాలు ఎక్కువగా అయిపోకూడదని మనోళ్ళు సింపుల్ గా ”హల్లో” అని పెట్టేశారు. ‘ఇష్క్’ ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన చిత్రాలకి రెండు అక్షరాల పేర్లే ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్‌ని అనుసరిస్తూ హలో అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.













