ఆకాశ్ పూరీ ‘మెహబూబా’ టైటిల్ పోస్టర్ రిలీజ్
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్డే సందర్భంగా పూరీ కొడుకు ఆకాశ్ పూరీ నటిస్తున్న మూవీ మెహబూబా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆకాశ్ సరసన మంగళూరు అమ్మాయి నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నది.
దీని గురించి పూరీ మాట్లాడుతూ.. తన ఆలోచనలకు భిన్నమైన కథ ఇదని చెప్పారు. సినిమాలపై తన కుమారుడికి ఉన్న ప్రేమ కారణంగానే తాను ఈ సినిమాను అంగీకరించినట్లు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్టు అంతా పూర్తి చేసుకున్న తర్వాతే తాను ఎంత అద్భుతమైన ప్రేమకథ తీస్తున్నాన్న విషయం అర్థమైందని చెప్పారు. 1971 భారత్- పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. సందీప్ చౌటా సంగీతం అందిస్తుండగా.. పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నటి ఛార్మి ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకొంటున్నారు.








