కేన్స్ లో మాజీ ప్రపంచ సుందరి సందడి
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సినీ ఉత్సవం కేన్స్‌లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎర్రతివాచీపై హోయలొలికింది. లొరియల్ ప్యాలెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐష్, కేన్స్ రెడ్‌కార్పెట్‌పై సందడి చేసింది. కేన్స్‌లో ఐష్ అందాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. మైఖెల్ సిన్కో డిజైన్ చేసి పౌడర్ బ్లూ వన్నె గౌనులో ఆ మాజీ ప్రపంచ సుందరి హోయల పోయి, అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఐశ్వర్య లుక్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె అందం ముందు డిస్నీ రాకుమారి కూడా చిన్నబోయింది అంటూ ఐష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అంతకు ముందుకు కేన్స్ ఫొటోషూట్‌లో ఆకుపచ్చని డ్రెస్లోనూ ఐష్ కనువిందు చేసింది.













