దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఐష్
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. గత ఏడాది వచ్చిన సరబ్ జిత్ చిత్రంలో నటించినందుకుగాను ఈమెకు అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐశ్వర్యారాయ్‌కు అవార్డును అందజేశారు. కార్యక్రమంలో హేమమాలిని, సయామీఖేర్, సుజిత్ సల్కార్, జీనత్ అమన్‌లు అవార్డులు అందుకున్నారు.








