‘అదుగో’ టీజర్ విడుదల
పందిపిల్లను చంకలో పెట్టుకుని ఏటీఎం సెంటర్ దగ్గర క్యూలో నిలబడి ఆ తన క్యూట్ పిగ్ పిల్లకి ఫుల్ పబ్లిసిటీ తెచ్చిపెట్టిన రవిబాబు తాజాగా పందిపిల్లనే హీరోగా పెట్టి ‘అదిగో’ అంటూ టీజర్ వదిలాడు. అసలు తాను తీస్తున్న ”అదుగో” సినిమా ఎందుకు లేటవుతోందో కూడా ఎవ్వరికీ చెప్పకుండా కామ్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడు తన సినిమాలోని ముఖ్యమైన పాత్రను పరిచయం చేస్తూ ఒక టీజర్ తో విచ్చేశాడు. ఒక విధంగా చూస్తే ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి.
వీడి పేరు బంటి.. వయసు ఆరునెలలు పెద్ద అల్లరి గాడు, వీడు చూడటానికి ఇంతున్నా బుర్ర చాలా పెద్దది అంటూ పందిని పరిచయం చేసిన రవిబాబుపై వీడు చూడటానికి అంతున్నా బుర్ర అస్సలు లేదు. వీడుకి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు. అందీ బంటీ (పంది పిల్ల) రవిబాబుపై పంచ్ లు పేల్చేస్తుంది.
ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘అదుగో’. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్ర ప్రీ టీజర్ విడుదలైంది. బంటి అనే పంది పిల్లను ప్రధాన పాత్రలో పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
టీజర్లో రవిబాబు బంటి గురించి గొప్పగా చెప్తూ పరిచయం చేస్తుంటే.. బంటి రవిబాబుని తిడుతుండడం ఫన్నీగా ఉంది. ‘సినిమాలో బంటి చాలా బాగా నటించాడు’ అని రవిబాబు పొగుడ్తుంటే.. ఇందుకు బంటి కౌంటర్‌గా ‘వీడు మాత్రం డైరెక్షన్ చాలా నీచంగా చేశాడు’ అంటుంది. దాంతో రవిబాబుకు కోపం వచ్చి ‘రేయ్ కోటి.. వీడిని ముక్కలు ముక్కలుగా నరికి బిరియాని చేసి సాయంత్రం నాకు పార్శిల్ పంపు’ అనడం నవ్వులు పూయిస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













