పెళ్లి పనుల్లో బిజీగా తమన్నా!
ఏంటి మిల్కీ భామ తమన్నా పెళ్లి చేసుకుంటుందా? అంటూ షాక్ అవుతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ముందు ఈ విషయం వినండి. ఆ తరువాత మీరే నిజమే అంటారు. అసలు విషయం ఏమిటంటే, గ్లామర్ భామగా సౌత్‌లో క్రేజ్ తెచ్చుకున్న తమన్నా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఆమె పెళ్లికోసం కాదండోయ్, వాళ్ల అన్నయ్య ఆనంద్ భాటియా కోసం? ఆనంద్‌కు ఈమధ్యే పెళ్లి కుదిరింది. దాంతో పెళ్లి కోసం బిజీగా మారిపోయింది తమన్నా. అన్నకు కావాల్సినవి అన్నీ దగ్గరుండి చూసుకుంటుందట. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరగడంతో పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయి. తన అన్నకు సంబంధించిన నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదీ విషయం.













