అవకాశాలు కావాలంటే అన్ని వదులుకోవాలి
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి చాలా ఎక్కువని, అవకాశాల కోసం లొంగిపోక తప్పదని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. తాజాగా మలయాళ నటి పార్వతి మీనన్ కూడా తనకు ఎదురైన అనుభవాల గురించి నోరు విప్పింది. ఈమె తమిళ సినీ పరిశ్రమలో ధనుష్‌తో మారియన్, ఆర్య, రానాలతో బెంగళూరు డేస్ వంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి గురించి మాట్లాడింది. ప్రస్తుతం సినీ పరిశ్రమ గురించి జరుగుతున్న ప్రచారం నిజమే. అక్కడ అవకాశాలు కావాలంటే అన్నింటినీ వదులుకోవాల్సిందే. అవకావం కావాలంటే బెడ్రూమ్కు రమ్మని డైరెక్ట్‌గానే అడుగుతారు. మలయాళ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పలువురు హీరోలు, దర్శకులు నన్ను తమ బెడ్రూమ్కు రమ్మనేవారు. అవకాశాలు కావాలంటే ఇలాంటివన్నీ కామన్ అని సర్దిచెప్పేవారు. నేను అందుకు నో చెప్పడం వల్ల ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. బెడ్రూమ్ వ్యవహారానికి సిద్ధపడి ఉంటే ఇప్పటికి చాలా సినిమాలు చేసేదాన్ని అని చెప్పింది పార్వతి.













