షాకింగ్: సినీ నటి జీవిత బంధువు అరెస్టు.. రూ.5కోట్ల పాత కరెన్సీతో పట్టుబడి!
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సినీ నటి జీవిత సమీప బంధువైన శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. రూ.5కోట్ల విలువ చేసే పాత కరెన్సీ నోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతంలోను శ్రీనివాసరావు అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం.
కాగా, పాత నోట్ల మార్పిడికి పోస్టాఫీసులు, డీసీసీబీ(జిల్లా కార్పోరేషన్ బ్యాంకు)లలో ఆర్బీఐ మరో నెల రోజులపాటు అవకావం కల్పించిన నేపథ్యంలో.. శ్రీనివాసరావు తన వద్దనున్న రూ.5కోట్లను మార్చడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది
భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారన్న సమాచారం అందగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన ఇంటిపై దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు పోలీసుల అదుపులోనే ఉండగా.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.













