రాజకీయాల్లోకి తెలుగు హీరోయిన్?
రాజోలు అమ్మాయి అంజలి రాజకీయాల్లోకి రాబోతోందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీలో చేరుతుందా ఏదైనా జాతీయ పార్టీలో చేరుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అంజలి రెండు మూడు పార్టీల నాయకులను కలిసి వారితో చర్చలు జరిపిందట. దాంతో అంజలి రాజకీయాల్లోకి రాబోతోంది అంటూ పుకార్లు బయలుదేరాయి. అయితే ఈ విషయంలో అంజలి కానీ, అమె సన్నిహతులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో అంజలి రాజకీయ ప్రవేశం వార్తలు నిజమే కావచ్చు అని కొందరు అంటున్నారు.








