ప్రభాస్ ని వెన్నుపోటు పొడిచిన బాలీవుడ్ హీరో!
బాహుబలి 2 చిత్రంలో కట్టప్ప బాహుబలిని చంపుతున్న సన్నివేశాన్ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. సినిమాలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ ప్రభాస్‌ని కత్తితో పొడిస్తే ఇప్పుడు అదే కత్తితో మరో కట్టప్ప ప్రభాస్‌ను పొడిచేశాడు. అతనెవరో కాదు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ తన నివాసంలో పార్టీ ఇచ్చాడు. పార్టీకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు రానా, ప్రభాస్ కూడా వెళ్లారు. అక్కడ సరదాగా వరుణ్ బాహుబలిలో కట్టప్ప వాడిన కత్తి పట్టుకుని ప్రభాస్‌ని పొడిచాడు. అందుకు ప్రభాస్ అచ్చం సినిమాలో మాదిరిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. వెంటనే పార్టీలో ఉన్నవారు వీరిద్దరి ఫొటో తీయడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.













