రాజశేఖర్ కూతురు తొలిసారి నటించబోయేది ఏ హీరోతో తెలుసా?
టాలీవుడ్ సెలబ్రిటీలు రాజశేఖర్, జీవితల గారాల పట్టీ శివాని త్వరలో హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకనట కూడా వచ్చేసింది. అయితే ఆమె తొలిసారి నటించబోయేది ఏ హీరోతో? ఎలాంటి సినిమా చేయబోతుందనే దానిపై చర్చలు జరుగుతుండగా ఓ విషయం తెరమీదకు వచ్చింది. నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ హీరోగా పరిచయం అయ్యే సినిమాలో హీరోయిన్గా నటించబోతోందని సమాచారం. ప్రస్తుతం శివ అమెరికా పెన్సిల్వేనియాలోని పెన్ స్టేట్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఏడాది అతడి చదువు పూర్తవుతుందని, 2018లో శివ, శివాని ఇద్దరినీ పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం కాబోతోందని సమాచారం. ఇక రీసెంట్ గా చేసిన శివాని ఫోటో షూట్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ యంగ్ బ్యూటీ భారతదేశంలోని అతి పెద్ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ క్యాన్ తో టై అప్ అయిందని అంటున్నారు. ఏది ఏమైనా శివాని ఎంట్రీ రాజశేఖర్, జీవిత అభిమానులకు చాలా ఆనందాన్నిస్తుంది.













