7 స్టార్ ప్రొడక్షన్ నూతన చిత్రం ప్రారంభోత్సవం
సీనియర్ దర్శకులు సూర్య కిరణ్ (సత్యం ఫేమ్) దర్శకత్వంలో రాజు గారి గది ఫేమ్ చేతన్ చీను హీరోగా ఫిలిం నగర్ సాయిబాబా గుడిలో ముహూర్తం జరుపుకుంది. ఈ చిత్తాన్ని తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో నిర్మిస్తున్నట్లు నిర్మాత పరిటాల రాంబాబు తెలియజేసారు .ఈ కధ నాలుగు క్యారెక్టర్స్ మధ్య జరిగే ధ్రిల్లింగ్ కధ అని, హీరోయిన్ మరియు సాంకేతిక నిపుణులను త్వరలో తెలియజేస్తాం అని, ఈ నెల 2వ వారం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గోవా లొకేషన్స్ లో షూటింగ్ చేయనున్నట్లు దర్శకుడు సూర్య కిరణ్ తెలియజేసారు.
హీరో చేతన్ చీను మాట్లాడుతూ దర్శకులు సూర్య కిరణ్ మంచి కధ చెప్పారని, ఈ కధ వినగానే థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యానని, సూర్య కిరణ్ దర్శకత్వం లో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసారు.
కెమెరా: P C కన్నా, ఎడిటర్ : గౌతంరాజ్, ఆర్ట్ : మురళి (ఘాజి ఫేమ్), మ్యూజిక్ : సాయి కార్తీక్, ఫైట్స్ : రమణ, పి ఆర్ ఓ : సత్య, దర్సకత్వం : సూర్యకిరణ్, నిర్మాత : పరిటాల రాంబాబు







