ఎంట్రీ కావాలంటే తప్పదు మరి
ఈ మధ్య హీరోయిన్స్ రెచ్చిపోతున్నారు. అందాల ఆరబోతతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తూనే మరోవైపు అవకాశాలు పట్టేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు బికినీలు, హాట్ షోలంటూ రెచ్చిపోతున్నారు. లేటెస్టుగా ఈ అమ్మడూ అందాలు అరబోసి షాకిచ్చింది? ఆ ఫొటోలు చూసి, మరీ ఇంతగానా? అంటూ షాక్ అవుతున్నారు జనం. ఆ అందగత్తె ఎవరో తెలుసా. గ్లామర్ భామ సమీక్ష. గుర్తురాలేదా? ఆ మధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన 143తో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ డాళ్. ఆ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. దాంతో కోలీవుడ్‌లోనూ ప్రయత్నాలు చేసినా చాన్స్‌లు లేక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ చాన్స్‌ల కోసం లేటెస్టుగా ఫొటో షూట్ చేస్తూ రెచ్చిపోయి పోజులిచ్చిందట. మరి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే అలాంటి గట్టి ప్రయత్నాలు తప్పపు మరి.













