రష్మిక కెరీర్లో ఇదో కొత్త అవతారం.. మైసా టీజర్ ఎలా ఉందంటే!
రష్మిక(rahsmika)లోని మరో యాంగిల్ ను చూపించే ప్రయత్నంగా తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మైసా(mysaa)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రవీందర్ పుల్లే(raveendar pulle) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అజయ్ సాయిపురెడ్డి(ajay saipureddy), అనిల్ సయ్యపురెడ్డి(anil sayyapureddy), వీరసాయి గోప(veerasai gopa) నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా డైరెక్టర్ రవీందర్ పుల్లే బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
టీజర్ ప్రారంభం నుంచే మైసా వరల్డ్ ఎంత క్రూరంగా ఉండబోతోందో చూపించారు. పలువురు వ్యక్తులు రష్మికను చుట్టుముట్టి హింసకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆమె పాత్ర పరిచయం అవుతుంది. గిరిజన యువతిగా కనిపిస్తున్న రష్మికకు పోరాటం కొత్త కాదు. అయితే తనకంటే బలమైన శక్తులు వెంటాడుతున్న పరిస్థితుల్లో న్యాయం కోసం ఆమె చేసే పోరాటమే కథకు ప్రధాన బలం కానున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. అవమానం, బాధ, కోపాన్ని దాటుకుని తిరుగుబాటుగా మారే పాత్రలో రష్మిక చూపించిన హావభావాలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఇవి కూడా చదవండి
యాక్షన్ సీన్స్ ను డైరెక్టర్ రవీందర్ పుల్లే భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. రష్మిక ఎక్స్‌ప్రెసివ్ కళ్ల ద్వారా క్యారెక్టర్ లోని వేదన, ఆవేశాన్ని బలంగా పలికించారు. జేక్స్ బిజోయ్(jakes bijoy) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు మరింత తీవ్రతను తీసుకొచ్చింది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయి యాక్షన్‌తో తెరకెక్కిన మైసా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.








