రణబాలి ప్రేమకథకు మెలోడీ టచ్.. ఏందయ్యా సామితో పెరిగిన అంచనాలు
విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(rashmika mandanna) జంటగా తెరకెక్కుతున్న రణబాలి(ranabaali) సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఏందయ్యా సామి(Endhayya saami) సాంగ్ ను ఇవాళ ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. 19వ శతాబ్దపు నేపథ్యంలో సాగే ఈ సాంగ్ ద్వారా రణబాలి, జయమ్మ(Jayamma)ల లవ్ స్టోరీలోని ఎమోషన్స్ ను ఆడియన్స్ కు ప్రేక్షకులకు పరిచయం చేశారు. సంప్రదాయ పెళ్లి వేడుకను ఈ సాంగ్ లో చూపించగా, అందులో అప్పటి సంస్కృతి, ఆచారాలు, పండుగ వాతావరణం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
సాంగ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చారు. జయమ్మగా రష్మిక సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకోగా.. రణబాలిగా విజయ్ చూపించిన ప్రేమ, ఆప్యాయత.. సీన్స్ కు స్పెషల్ ఫీల్ తీసుకొచ్చాయి. రంగురంగుల విజువల్స్‌తో పాటు పెళ్లి వేడుకలోని సాంస్కృతిక అంశాలను డైరెక్టర్ కథకు అనుగుణంగా చూపించిన తీరు ఆసక్తిని పెంచుతోంది. పెళ్లి తర్వాత రెండు మనసులు ఒక్కటయ్యే భావాన్ని రామజోగయ్య శాస్త్రి(ramajogayya sastry) సాహిత్యం చక్కగా ఆవిష్కరించింది.
అజయ్(ajay)- అతుల్(Atul) స్వరపరిచిన ఈ మెలోడీకి శ్వేతా మోహన్(Swetha mohan), అజయ్ గోగావలే (ajay gogavale)తమ గాత్రంతో ప్రాణం పోశారు. ఆల్రెడీ రిలీజైన చిన్న ప్రోమోతో సాంగ్ పై ఆసక్తి పెరగగా.. ఇప్పుడు ఫుల్ సాంగ్ మరింత ఆకట్టుకుంటోంది. దీంతో రణబాలి సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.








