నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్
నందమూరి ఫ్యాన్స్ ను కొంతకాలంగా ఆందోళనకు గురిచేసిన బాలకృష్ణ(balakrishna), ఎన్టీఆర్(NTR) గాయాల విషయంలో ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడిన బాలకృష్ణ పూర్తిగా కోలుకుని తన తర్వాతి సినిమా దాదా(dada) షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు మైసూర్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ 2026 కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని టార్గెట్ గా పెట్టుకుంది.
ఇక ఎన్టీఆర్ కూడా భుజానికి అయిన గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఈ నెలలోనే హైదరాబాద్‌లో డ్రాగన్(Dragon) షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్‌ను టీమ్ ప్లాన్ చేస్తుండగా, సినిమా 2027 జూన్ 11న థియేటర్లలోకి రానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనూ షూటింగ్ పునఃప్రారంభంపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కీలకమైన అప్డేట్ రావడం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. మోక్షజ్ఞ తేజ(mokshagna teja) హీరోగా పరిచయం కానున్న తొలి సినిమా ఈ నెలలోనే గ్రాండ్‌గా లాంచ్ కానుంది. వశిష్ఠ(vassishta) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూపై ఇప్పుడు అధికారిక కదలిక మొదలవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. బాలయ్య, ఎన్టీఆర్ తిరిగి షూటింగ్స్‌కు సిద్ధమవుతుండటం, మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కుతుండటంతో అక్టోబర్ నందమూరి ఫ్యాన్స్ కు వరుస శుభవార్తలు తీసుకొస్తోంది.








