అమెరికాకే షాక్ ఇస్తున్న చైనా AI..! అసలు ఏం జరుగుతోంది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఇప్పటి వరకు ChatGPT, Claude వంటి అమెరికా AIలదే హవా అనుకున్న ప్రపంచానికి ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఎదురైంది. అమెరికా డెవలపర్లు ఉపయోగించే ప్రముఖ AI ప్లాట్‌ఫారమ్ OpenRouterలో చైనా AI మోడళ్ల వినియోగం ఏడాదిలోనే 4.5% నుంచి 30%కిపైగా పెరిగింది. కొన్ని వారాల్లో ఈ వాటా 46% వరకు చేరినట్లు CNBC వెల్లడించింది.
OpenRouter అంటే ఏమిటి? ChatGPT, Claude, Gemini, DeepSeek వంటి అనేక AI మోడళ్లను ఒకే చోట ఉపయోగించేందుకు డెవలపర్లు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్.
దీనికి ప్రధాన కారణం ఒక్కటే… తక్కువ ఖర్చుతో దాదాపు అదే స్థాయి పనితీరు. చైనా కంపెనీ Z.ai రూపొందించిన GLM 5.2 మోడల్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన AIల్లో ఒకటిగా భావించే Claude Opus 4.5కే గట్టి పోటీ ఇస్తోంది. అంతేకాదు, దాదాపు ఐదో వంతు ఖర్చుతోనే ఇదే స్థాయి పనితీరు అందిస్తోందని OpenRouter డేటా చెబుతోంది.
ఇదే ఇప్పుడు అమెరికాలో కొత్త ఆందోళనకు దారితీసింది. చైనా అభివృద్ధి చేసిన AI మోడళ్ల వినియోగం పెరగడంతో డేటా భద్రత, జాతీయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒకప్పుడు అమెరికా ఆధిపత్యంలో ఉన్న AI రంగంలో ఇప్పుడు చైనా సైలెంట్‌గా గేమ్ మార్చేస్తోందా? అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.








