అవి చీప్ ఫేక్ వీడియోలు… వైట్ హౌస్ ఆగ్రహం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంపై ఉహాగానాలు ఎక్కువవుతున్నాయి. ఆయన ఆరోగ్యం గురించి అనుమానాలు వ్యక్తమయ్యే రీతిలో పలు వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా వైట్‌హౌస్ స్పందించింది. విపక్ష రిపబ్లికన్ పార్టీ నేతల వైఖరిని విమర్శించింది. రిపబ్లికన్లు ఎంత నిరాశలో ఉన్నారో కనిపిస్తోంది. దృశ్యాలను వక్రీకరించి, ఆ పార్టీకి చెందిన కొందరు వ్యాప్తి చేస్తున్నారు. అవి చీప్ఫేక్ వీడియోలు అంటూ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ విమర్శించారు.






