దిగనంటే ఇలా దింపుతారు…
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. అగ్రరాజ్య తదుపరి అద్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. దీంతో డెమోక్రాట్ శిబిరం సంబురాల్లో మునిగితేలుతున్నది. మరోవైపు, రిపబ్లికన్ వర్గం మాత్రం ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తున్నది. ఓటమిని అంగీకరించబోనని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో.. శ్వేతసౌధాన్ని ఆయన ఖాళీ చేయకపోతే ఏమౌతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో పనిచేసిన 44 మంది అధ్యక్షల్లో వైట్‌హౌజ్‌ను ఖాళీ చేసేందుకు ఎవరూ తిరస్కరించలేదు. ఒక వేళ ట్రంప్ ఖాళీచేయకపోతే, అమెరికా సీక్రెట్ సర్వీస్ బలవంతంగా ఆయనను ఖాళీ చేయించాల్సి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ట్రంప్ అధికారికంగా ఓటమిని అంగీకరించరని, అయితే ఆయన గడువు ముగిసిన తర్వాత అయిష్టంగానైనా వైట్‌హౌజ్‌ను ఖాళీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.






