ట్రంప్ పోటీలో లేకపోతే.. తాను కూడా
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తీర్పుపై రిపబ్లికన్ నేత, అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి స్పందించారు. ట్రంప్‌ను పోటీ పడేందుకు అనుమతించకపోతే నేను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతా. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర రిపబ్లికన్ నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా, లేదంటే ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు మౌనంగా సమర్థించిన వారవుతారు. ఇలాంటి తీర్పుల కారణంగా దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






