Vivek Ramaswamy : ట్రంప్ కొలువు నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి

అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కార్యవర్గం నుంచి వ్యాపారవేత్త, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) వైదొలిగారు. ఒహాయో గవర్నర్(Ohio Governor) పదవికీ పోటీ చేయడానికి సిద్ధం కావాలని యోచిస్తున్నందున ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో కీలకమైన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ట్రంప్ డోజ్ (Doze) ఏర్పాటును ప్రకటించారు. టెస్లా యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) వివేక్ రామస్వామిని ఈ కొత్త ఏజెన్సీకి నాయకత్వం వహించమని ఆదేశించారు. ఒహాయో గవర్నర్ పదవికి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. వివేక్ గెలుపొందితే ఒహాయోకు తొలి భారతీయ అమెరికన్ గవర్నర్ అవుతారు.