కమలాహారిస్ ఓ కీలుకొమ్మ : వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలా హారిస్‌ను ఆయన ఓ కీలుబొమ్మగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు సరైన వ్యక్తి. ఆయన విజయానికి కృషి చేస్తా. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ నామమాత్రమైన వ్యక్తి, కీలుబొమ్మ. ఆమె తన ప్రసంగాల్లో ఎక్కడా విధానాల గురించి మాట్లాడడం లేదు. ఆర్థిక విధానాల్లో విఫలమయ్యారు. అదే ఆమెకు ప్రజాదరణను తగ్గిస్తుంది. మేం విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. అయితే మేం మరింత కష్టపడాల్సి ఉంది. విధానాలపై గెలుస్తాం అని తెలిపారు.






