అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వానికి వ్యతిరేకం : వివేక్ రామస్వామి
అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వడానికి తాను వ్యతిరేకమని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. అమెరికా దక్షిణ సరిహద్దును సైనికీకరణ చేస్తామని, మెక్సికోతో పాటు మధ్య అమెరికా దేశాలకు విదేశీ సాయాన్ని నిలిపేస్తామని తెలిపారు. కాలిఫోర్నియాలోని సిమీవ్యాలీలో జరిగిన రిపబ్లికన్ అభ్యర్థుల రెండో చర్చావేదికలో ఆయన పాల్గొన్నారు. మిల్వాకీలో జరిగిన తొలి చర్చావేదికకు రాని మాజీ అధ్యక్షుడు ట్రంప్ దీనికి డుమ్మా కొట్టారు. మిగిలిన ఏడుగురు అభ్యర్థులు పాల్గొన్నారు. వారిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఉన్నారు. అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.






