కమలా హారిస్ భర్తకు భాంబు బెదిరింపులు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త, సెకండ్ జెంటిల్‌మ్యాన్ డగ్లస్ ఎమ్హోఫ్ భద్రతకు ముప్పు వాటిల్లడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించిన ఘటన చోటు చేసుకుంది. బ్లాక్ హిస్టరీ మంత్ వేడుకల్లో భాగంగా డగ్లస్ ఎమ్హోప్ వాషింగ్టన్‌లోని డన్బార్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో డగ్లస్ ఎమ్హోఫ్ పాల్గొన్న కార్యక్రమంలో బాంబు దాడి జరిగే ప్రమాదం ఉందనే సమచారంతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే డగ్లస్ ఎమ్‌హోఫ్‌ను అక్కడి నుంచి తరలించారు. అంతేకాకుండా విద్యార్థులను కూడా స్కూల్ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ ప్రకమంలో విద్యార్థులు కూడా పాఠశాల నుంచి వెళ్లిపోయారు. అందరూ సురక్షితంగా ఉన్నట్టు వాషింగ్టన్ పబ్లిక్ స్కూల్ అధికార ప్రతినిధి వెల్లడిరచారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.






