బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్ కు చోటు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు భారతీయ సంతతి వైద్యుడు వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని సేనేట్ ధ్రువీకరించింది. కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాకు సర్జన్ జనరల్ పాత్రలో వివేక్ మూర్తి కీలక సూచనలు చేయనున్నారు. 43 ఏళ్ల డాక్టర్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్ పదవిని చేపట్టడం ఇది రెండవసారి. 2011లోనూ మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ప్రభత్వు సమయంలో వివేక్ మూర్తి హెల్త్ అడ్వైజర్‌గా పని చేశారు. సర్జన్ జనరల్‌గా సేనేట్ ధ్రువీకరించడం పట్ల వివేక్ మూర్తి ధన్యవాదాలు తెలిపారు.
గత ఏడాది నుంచి అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని, దేశం కోలుకునేందుకు మీతో కలిసి పనిచేస్తానని, మన పిల్లల కోసం ఉత్తమ భవిష్యత్తును అందిస్తామని వివేక్ మూర్తి తెలిపారు. సేనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో వివేక్‌కు అనుకూలంగా 57 ఓట్లు వచ్చాయి. 2013లోనూ సర్జన్ జనరల్‌గా వివేక్ పనిచేశారు. 37 ఏళ్లకే ఆ పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. కానీ ట్రంప్ పాలన సమయంలో ఆ పదవిని ఆయన వీడారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడు మంది సేనేటర్లు డాక్టర్ మూర్తికి అనుకూలంగా ఓటేశారు.






